
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ రకంగా మరోసారి తెర మీదికి వచ్చారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి వీరిద్దరు అత్యంత సన్నిహితులు. ఆయన హయాంలో వారు కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వారికి పెద్దగా పదవులు లభించలేదు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలోనే వారు చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేశారు. చిరు అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ తర్వాత చాలా కాలం మౌనంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు తెర మీదికి వచ్చారు.
ఈసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రధానం చేసుకుని రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వం నుంచి విపరీతమైన ప్రోత్సహాకాలు పొందుతూ పేదలకు సాయం చేస్తున్నది తక్కువ అని వారి ఆరోపణల్లో ప్రధానమైంది. చిరంజీవి వ్యక్తిత్వంపై కూడా వీరు విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెసు పార్దీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇస్తూ వైయస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేయడంతో రాజశేఖర్ దంపతులు తెర మీదికి వచ్చారు. జగన్ కోసమే వారు ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరైతే జగన్ దూరమవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవిని అడ్డుకుందనేందుకే వారు ఆరోపణలు చేశారని అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి