22, ఆగస్టు 2010, ఆదివారం

రామ్ చరణ్ అఫిషీయల్ వెబ్ సైట్ క్లోజ్


చరణ్ హీరోగా పరిచయం కానున్నాడని తెలియగానే అతని పేరిట ‘చెర్రీఫాన్స్.కామ్’ అనే వెబ్ సైట్ స్టార్ట్ చేసి అదే చరణ్ అఫీషియల్ వెబ్ సైట్ అంటూ ట్యాగ్ కూడా తగిలించుకున్నారు. చరణ్ తో పాటు పనిలో పనిగా ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రమోట్ చేసిన సదరు వెబ్ సైట్ స్టార్ట్ చేసి అదే చరణ్ అఫిషియల్ వెబ్ సైట్ అంటూ ట్యాగ్ కూడా తగిలించుకున్నారు. చరణ్ తో పాటు పనిలో పనిగా ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రమోట్ చేసిన సదరు వెబ్ సైట్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఓ ప్రముఖ వెబ్ సైట్ నిర్వాహకుడి సోదరుడు స్థాపించిన ‘చెర్రీఫాన్స్’ ఎలాంటి కబురూ లేకుండా ఎందుకు ఎత్తేసినట్టో ఎవరికీ తెలీదు.

చెర్రీ ఫాన్స్’ నిర్వాహకుడు ప్రజారాజ్యం స్థాపించిన కొత్తల్లో చిరంజీవి వెన్నంటే తిరిగేవాడు. చిరంజీవి అంటే చెవి కోసుకునే సదరు వ్యక్తి ఎప్పుడూ పార్టీ ఆఫీసు పరిసరాల్లోనే కనిపించేవాడు. మరి ఇప్పుడు ఏమయిందో ఏమో చెర్రీ అఫీషియల్ వెబ్ సైట్ ని పూర్తి గా క్లోజ్ చేసేశాడు. ప్రతి స్టార్ కీ అభిమానులు స్వయంగా నిర్వహించే ఫాన్స్ వెబ్ సైట్ వుంది కానీ మెగా ఫాన్స్ పేరిట మొదలైన ఏ వెబ్ సైటూ చిరకాలం నిలవలేదు. ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ నడపడంలో విఫలమైనా ఆర్కుట్ లాంటి నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ లో మాత్రం మెగా ఫాన్ప్ యమ యాక్టివ్ గా ఉంటున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి