7, ఆగస్టు 2010, శనివారం

అప్పుడు ప్రజల కోసం...ఇప్పుడు అభిమానుల కోసం: చిరు


తను స్థాపించిన ప్రజారాజ్యం అధికార పార్టీ అవ్వలేకపోయినా..కనీసం ప్రధాన ప్రతిపక్షమూ కాలేకపోవడంతో కావాల్సినంత ఖాళీ దొరికేసింది చిరంజీవికి. దాంతో వచ్చే ఎన్నికలలోపు ఓ సినిమా చేసేసుకుంటే ఇటు మేకప్ సరదా తీరుతుంది..అటు మెగా ఫ్యాన్స్ కీ కాస్త ఉత్సాహం వస్తుందనే ఆలోచనలో వున్న చిరంజీవికి. దాంతో వచ్చే ఎన్నికలలోపు ఓ సినిమా చేసుకుంటే ఇటు మేకప్ సరదా తీరుతుంది..అటు మెగా ఫ్యాన్స్ కి కాస్త ఉత్సాహం వస్తుందనే అలోచనలో వున్న చిరంజీవి కోసం తనదైన శైలిలో ఓ ప్రణాళిక సిద్దం చేశారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ లో చేస్తే సొంత సినిమా అవుతుంది కనుక ఆత్మీయుడు అశ్వనీదత్ బేనర్ లో మెగా మూవీని మలిచేందుకు స్కెచ్ వేశారు.

అలాగే ఆల్ మోస్ట్ చిరు చివరి సినిమా అనదగ్గ ఆ చిత్రంలో ఏయే అంశాలు వుండాలో, ఎలాంటి కథతో వెళ్ళాలో కూడా నిర్ణయించేసుకున్నారట. ఓ అగ్ర దర్శకుడి ఆధ్వర్యంలో ప్రస్తుతం సమగ్ర చర్చలు జరుపుతోన్న ఈ మెగా ప్రాజెక్ట్ వివరాలను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న అభిమానుల కోసం అధికారికంగా వెల్లడించనున్నారు. అన్నట్టు ఈ సినిమా విషయంలో చిరంజీవి మళ్ళీ సేమ్ స్లోగన్ స్టార్ట్ చేశారండోయ్. గతంలో ‘ప్రజలు పిలిచారనే రాజకీయాల్లోకి వెళ్ళాను’ అన్నట్టే ఇప్పుడు ‘అభిమానులు అడుగుతున్నారనే మళ్ళీ సినిమా చెయ్యబోతున్నాను’ అంటున్నారిప్పుడు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి