12, ఆగస్టు 2010, గురువారం

చిత్తూరు జిల్లాలో చిరంజీవి కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి


చిత్తూరు: ఊహించినట్లుగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి రాయలసీమ పర్యటనలో కొంత మేరకు ఆటంకం ఎదురవుతోంది. గురువారంనాడు చిత్తూరు జిల్లాలో చిరంజీవి కాన్వాయ్ పై దుండగులు కోడి గుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్ పైకి భవనాలపై నుంచి, చెట్లపై నుంచి వారు కోడిగుడ్లు విసిరారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఆరోపణలు చేసినందుకు చిరంజీవి పర్యటనను అడ్డుకుంటామని ఇది వరకే ప్రకటించారు.

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, చిరు అభిమానులు పెద్దగా లేకపోవడంతో ఎదురు దాడి జరగలేదు. కోడి గుడ్ల దాడి చేసినవారిని చిరంజీవి క్షమించేశారు. వారిని అరెస్టు చేయవద్దని, వదిలేయాలని ఆయన పోలీసులకు సూచించారు. తిరుపతి శాసనసభా నియోజకవర్గంలో తప్ప చిరంజీవి ప్రజారాజ్యానికి రాయలసీమలో పెద్దగా బలం లేదు. కాగా, చిరు పర్యటన నేపథ్యంలో పోలీసులు గురువారం ఉదయం కొంత మంది జగన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి