
విశాఖపట్నం: ప్రతినిధుల సంఖ్య తగ్గి విలవిలలాడుతున్న చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీకి వర్షం దెబ్బ తోడైంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విశాఖపట్నం లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్లీనరీ ఆవరణ అంతా నీటితో నిండిపోయింది. దీంతో ప్లీనరీకి ప్రతినిధుల హాజరు తగ్గింది.
కాగా, ప్లీనరీలో పాల్గొన్న నాయకులంతా ప్రసంగాలు దండిగానే చేస్తున్నారు. పార్టీ పుంజుకుంటుందని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణదేవుడు కూడా చిరంజీవికి వ్యతిరేకంగానే పనిచేస్తుండడం పట్ల అనుకున్నంత ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలు జరగడం లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి