
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని సినీ నటి జీవిత అన్నారు. ఆ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని అన్నారు. తనకు, తన భర్తకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడు.
తనకు, తన భర్త రాజశేఖర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, సంక్షిప్త సందేశాలు వస్తున్నాయంటూ సినీ నటి జీవిత ఇచ్చిన ఫిర్యాదును బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. తన ఫోన్ నెంబరుకు 9963561116 నుంచి బెదిరింపు కాల్స్, అసభ్యపదజాలంతో సంక్షిప్త సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 9391847245, 8143597912, 9949326819, 9676727262 నెంబర్ల నుంచి సైతం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి