8, ఆగస్టు 2010, ఆదివారం

చిరు ఇంకా చంటబ్బాయే!


ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పరిస్థితి అన్ని పార్టీల అధ్యక్షులకన్నా దయనీ యంగా ఉంది. ఎప్పుడేమి మాట్లా డతారో తెలియని గందరగోళం ఎప్పుడేమి మాట్లాడాలో తెలియని అమాయకత్వం ఏ సమయంలో ఎలా వ్యవ హరించాలో తెలియని అయోమయంతో తను ఇబ్బంది పడుతూ పార్టీనీ ఇబ్బందిపాలు చేస్తున్నారు. చిరు సినిమాలో మెగా హీరో అయినప్పటికీ బయట ప్రజలు ఇతర పార్టీల వారు తమను -తమ పార్టీని కామెడీగా చూస్తున్నారంటూ మహిళా నేతలు తన ఎదుటే వాపోవడం చిరంజీవికి చిక్కులు తెస్తోంది. తనంతట తాను రాజకీయాల్లోకి రాలేదని ప్రజలు పిలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చానని ప్రారంభంలో చెప్పిన చిరంజీవి మీరు పిలిస్తేనే వచ్చానని రెండురోజుల క్రితం జరిగిన అభిమానుల సదస్సులో చెప్పారు. తానిక సినిమాల్లో నటించేది లేదని అదే వేదికపై చెప్పిన చిరంజీవి ఒక రోజు కూడా గడవకముందే శంకర్‌ అలకాశమిస్తే సినిమాల్లో నటిస్తా నని చెప్పడం బట్టి ఆయన మానసిక పరిస్థితికి అద్ధం పడుతోం దన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మళ్లీ అంతలో నే.. రజనీకాంత్‌ కూడా పార్టీ పెడతానని అనుకుని తాను ముందే పార్టీ పెట్టి మోసపోయానని అమాయకంగా ప్రకటించ డం పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. దీన్ని బట్టి చిరంజీవి కి అసలు పార్టీ పెట్టడం ఇష్టం లేదని ఆయనను పక్కనున్న ఆత్మబంధువే బలవంతంగా రాజకీయాల్లోకి దింపారన్న సంకేతాలు వెళ్లడంపై �ఇంకా మిగిలిన నాయకుల్లో� ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా ఆఫీసులు మూతబడిపోగా.. ఏదో ఉండీ లేనట్లు నడుస్తున్న పార్టీలో ఇంకా అసమ్మతి స్వరాలు వినిపించడం చిరంజీవికి చికాకు కలిగిస్తున్నాయి. తాను ఇకపై రాజకీయాల్లో ఒక మార్గదర్శకుడిగా రాజనీతిజ్ఞుడిగా ఉంటా నని చెప్పినప్పటికీ చిరంజీవి పరిస్థితి రాజకీయాల్లో ఇంకా ఎదిగీ ఎదగని చంటబ్బాయ్‌ చందంగానే కొనసాగు తోంది. ఎదిగీ ఎదగని అంత రంగం తెలిసీ తెలియని విధానానాలతో చిరంజీవి ఇబ్బందిపడుతున్నారు. జగన్‌ పార్టీ నుంచి వెళ్లిపో తే.. తాను కాంగ్రెస్‌తో జతకట్టి కల నెరువేర్చుకోవాలన్న దింపుడుకల్లెం ఆశతో ఎటు వెళుతున్నారో తెలియని అడుగులు వేస్తున్నారు. తాను ప్రతిపక్షమా? అధికార పక్షమా అని తేల్చుకోలేని అయోమయంలో ఉన్నారు. సొంత పార్టీకి �ఆపద్బాంధవుడు� కాకపోయినా రోశయ్యకు మాత్రం చక్కగా సహకరిస్తున్నారు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెడితే పీఆర్పీని అందులో విలీనం చేయాలా? జగన్‌ కొనసాగితే పొత్తుతో సరిపుచ్చుకోవాలా? అన్న ప్రశ్నలు చిరంజీవి �రైలు�ను దిక్కు దశ లేకుండా చేస్తున్నాయి. ఉన్న కొద్దిమందీ పార్టీని వీడుతుం డటం కొత్త వారు చేరకపోవడంతో పార్టీని ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి