
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల డేట్స్ ఏకకాలంలో సంపాదించడం ఎంత గొప్ప విషయమో ఏమో కానీ..ఈ ఇద్దరు ‘ఫర్ ఫెక్ట్’ బద్దకస్తుల వల్ల ఎంత గొప్ప ఆస్తిపరుడైనా ఆస్తులమ్ముకునే పొజిషన్ కి రాగలడని రుజువైంది. ‘కొమరం పులి’, ‘మహేష్ ఖలేజాల పేరు చెప్పి శింగనమల రమేష్ కి తొంభై కోట్ల పైనే హారతి అయిపోయాయని టాక్ వినిపిస్తోంది. ‘కొమరం పులి’ రిలీజ్ వాయిదా పడడానికి గల కారణాల్లో శింగనమల ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణమని అంటున్నారు. ఈ చిత్రం డిస్ట్రి బ్యూషన్ రైట్స్ ని అల్లు అరవింద్ కి ఏనాడో అమ్మేసినా, అప్పుడు కుదుర్చుకున్న బేరానికి అయితే తనకు వర్కవుట్ కాదని, శింగనమల ఇంకొన్ని కోట్లు ఎక్స్ ట్రా డిమాండ్ చేస్తున్నాడట.
అయితే దానికి అల్లు అరవింద్ క్యాంప్ నుంచి సరయిన రెస్పాన్స్ లేకపోవడంతో డీల్ సెటిల్ కావట్టేదని, ఈ నేపథ్యంలో సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకోవడానికే శింగనమల రెడీ అవుతున్నాడని, అల్లు అరవింద్ తో చేసుకున్న ఒప్పందాన్ని కాన్సిల్ చేసుకునేందుకు, తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేందుకు శింగనమల కోట్ల విలువ చేసే ఆస్తులు అమ్మకానికి పెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘కొమరం పులి’ సంగతి తేలితే కానీ ‘ఖలేజా’ బయటకు రాని పరిస్థితి ఉండడంతో, ఇప్పుడు ఎలాగైనా ‘పులి’ని త్వరగా బయటకు తీసుకొచ్చి తన అదృష్టాన్ని బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకోవడమే శింగనమలకు అతి పెద్ద సవాల్ గా పరిణమించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి