
ప్రజారాజ్యంలో పెద్ద ముసలం మొదలైంది. ఈ ముసలం ప్రభావం ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే దిశగా సాగవచ్చు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు ఏకంగా పార్టీసీనియర్ నేతగా చెలామణి అవుతున్న కోటగిరి విద్యాధరరావుపై అస్త్రాన్ని గురిపెట్టారు, పార్టీని నాశనం చేస్తున్న చీడపురుగు కోటగిరిని వదిలించుకుని పార్టీని కాపాడుకోవాలని పార్టీఅధినేత చిరంజీవికి బుధవారం బహిరంగ లేఖరాశారు. అంతకుముందు వారంరోజుల కిందటకూడా ప్రజారాజ్యం పార్టీ మహిళావిభాగం మాజీ అధ్యక్షురాలుశోభారాణి చిరంజీవికి పార్టీ పరిస్థితులపైనే లేఖరాశారు.
పార్టీ ఆ నలుగురివల్లే చెడిపోతోందంటూ ఘాటుగానేేలేఖను సంధించారు. పార్టీకార్యలయంలోకి మహిళా నాయకులు కార్యకర్తలు స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారంటూ లేఖలో ఆవేదన వెలిబుచ్చారు. వేల్పూరి మరోఅడుగు ముందుకేసి ఏకంగా అనలుగురిని బయటపెట్టారు. పార్టీఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకుని సొమ్ముచేసుకున్న అల్లు అరవింద్ ఆ తర్వాత పార్టీలో ఎక్కడా కనిపించకుండా పోయారంటున్న విమర్శలు మళ్ళీ మొదలయ్యాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి