
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర వహించడానికి ముందుకు వచ్చిన చిరంజీవి బావ మరది అల్లు అరవింద్ పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అల్లు అరవింద్ రీ ఎంట్రీని స్టేట్ కాపు నాడు పొలిటికల్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజారాజ్యం పార్టీలో గురువిందలాంటి అల్లు అరవింద్‌ను పక్కన పెట్టాలని స్టేట్ కాపునాడు పొలిటికల్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పీఎల్‌వీ ప్రసాద్‌రావు డిమాండ్ చేశారు.
చిరంజీవి, అరవింద్ కలిసి పార్టీ పెట్టి రాజకీయాన్ని కంపు కంపు చేశారని వ్యాఖ్యానించారు. వీరి కారణంగా కాపు కులం రాజకీయంగా మటాష్ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అన్ని కులాల నుంచి సమర్థులను ఎంపిక చేసి, వారి భుజాలపై పార్టీ భారం పెట్టాలని ఆయన చిరంజీవికి ఆయన మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కూడా తెనాలిలో తమ వల్లనే నాయకుడు అయ్యారని, ఇప్పుడు కాపులకు ఒక్క నామినేటెడ్ పదవి ఇవ్వలేదని ఆరోపించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి