
ఎప్పటికప్పుడు విడుదల తేదీ వాయిదాలు పడుతూ రావడం..నేటికీ రిలీజ్ డేట్ పై సరైన స్పష్టత లేకపోవడం ‘కొమరం పులి’ పాలిట ప్రతికూలాంశంగా మారింది. జూలై 11న ‘పులి’ ఆడియో ఫంక్షన్ ని అట్టహాసంగా నిర్వహించి, ఆగస్ట్ 11నే ‘పులి’ రాకకు రంగం సిద్దమనే సంకేతాలిచ్చి ఒక్కసారిగా అభిమాన ప్రేక్షకులలో ఊపు తీసుకురాగలిగారు కానీ అనుకున్న తేదీలకు సినిమా రాకపోవడంతో..అసలేడేట్ కి వస్తుందన్నదీ తెలియకపోవడంతో ఇప్పుడు అభిమానుల్లోనూ ఊపు తగ్గపోతోంది.
ప్రేక్షకులలోనూ ఆ ఉత్సాహం సన్నగిల్లిపోతోంది. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 1న ‘కొమరం పులి’ విడుదల ఖాయమనీ, పవర్ స్టార్ బర్గ్ డే గిప్ట్ ని ఫ్యాన్స్ అందుకుంటారనీ వ్యాఖ్యానించిన చిత్ర వర్గం నేడు సైలెంట్ అయిపోయింది..సెప్టెంబర్ 1న కూడా పులి రాదంటూ తేల్చేసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సెప్టెండర్ లో ‘పులి’ రిలీజ్ అవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలలో జాప్యం వెనుక అనేక ఆర్థిక లావాదేవీలు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా మరోవైపు మహేష్ ‘ఖలేజా’, జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ చిత్రాలు అక్టోబర్ లో దసరా కానుకగా దర్శనమివ్వనున్నాయి.
సూపర్ స్టార్ రజనీ సెన్సేషనల్ ఫిల్మిం ‘రోబో’ అయితే సెప్టెంబర్ 23నే రంగంలోకి దిగనుంది. పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే ఈ చిత్రానికి సంబంధించిన వాళ్లెవరైనా ఓ చెయ్యేసి దీనిని బయటకు తీసుకురావాల్సిన అవసరముంది. మరీ నేపథ్యంలో క్రేజ్ కోల్పోయే ప్రమాదమున్న ‘కొమరం పులి’ వెండితెర వేదికపై ఎప్పుడు అడుగు పెడుతుందో, అందరి అనుమానాలూ పఠాపంచలయ్యేలా ఏ మేరకు గర్జించగలదో వేచి చూడాలి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి