
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మహిళారాజ్యం నేత శోభారాణి మెగా షాక్ ఇచ్చారు. చిరంజీవికి ఆమె గురువారం ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రజారాజ్యం పార్టీలో మహిళలకు అంతగా గుర్తింపు లేదని, ఈ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పూర్తిగా విఫలం ఆయ్యారని శోభా రాణి విమర్శించారు. మహిళలు తమ కుటుంబసభ్యులతో పోరాడి పార్టీలోకి చేరినా వారి «శమకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె తన లేఖలో వివరించారు.
చిరంజీవి చుట్టు ఉన్న ఆ నలుగురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని శోభారాణి విమర్శించారు. కాని 'ఆ నలుగురు' ఎవరో ఆమె చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీగా పీఆర్పీ పూర్తిగా విఫలమైందని, పార్టీ ప్రధాన ఎజెండాగా పేర్కొన్న సామాజిక న్యాయాన్ని చిరంజీవి పూర్తిగా విస్మరించారని ఆమె అన్నారు. బడుగు వర్గాల అభివృద్ధికోసం పీఆర్పీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, విధివిధానాల్లో కూడా ఏ మాత్రం స్పష్టత లేదని శోభారాణి అన్నారు. మహిళలు ఈరోజున పార్టీ కార్యాలయానికి రాలేని పరిస్థితి వుందని ఆమె ఆవేదన వ్యక్త్తం చేశారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి