
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కి పొగరు అని సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత వ్యాఖ్యానించారు. చిరంజీవి బయట ఒక రకంగా, లోపల మరో రకంగా ఉంటారని వారు ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. బయటకు హీరోలా కనిపిస్తారని, లోపల అందరినీ అవమానిస్తారని వారన్నారు. చిరంజీవి అసలు స్వరూపం తెలియాలనే తాము మాట్లాడుతున్నామని వారన్నారు. చిరంజీవి ఏనుగులా ఉన్నాడనేది నిజమేనని వారు ఏనుగులను చూసి కుక్కలు మొరుగుతాయని అల్లు అరవింద్ అనడంపై వారు వ్యాఖ్యానించారు.
బ్లడ్ బ్యాంక్ పై మాట్లాడితే నాలుక కోస్తానని అల్లు అరవింద్ అనడంపై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎందరి నాలుకలు కోస్తారని వారు అడిగారు. చిరంజీవి అంటే తాను పడి చచ్చేవాడినని, అయితే చిరు అసలు రూపం చూసిన తర్వాత అది అందరికీ తెలియాలనేది తన ఉద్దేశమని రాజశేఖర్ అన్నారు. ఇతరులను అవమానించడం చిరంజీవికి ఓ సరదా అని ఆయన అన్నారు. హీరోలమైనంత మాత్రాన తాము ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్లు భావించుకోకూడదని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి